హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం భక్తులకు గుడ్ న్యూస్

KKD: కార్తీక మాసంలో అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా డిజిటల్‌తో పాటు నగదు చెల్లింపులకూ అవకాశం కల్పించాలని కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆదేశించారు. ప్రస్తుతం ఆలయంలో డిజిటల్ చెల్లింపులే అమల్లో ఉండటంతో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.