AKP: మిషన్ మార్చ్–2027లో భాగంగా గొలుగొండ మండల విద్యాశాఖ అధికారి–II స్థానిక కేజీబీవీ పాఠశాలను శనివారం సందర్శించి తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా విధానాలు, హాస్టల్ వసతులు, రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను సమీక్షించారు. విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కేజీబీవీని తనిఖీ చేసిన ఎంఈఓ


