KDP: బ్రహ్మంగారిమఠం మండలం జెడ్. కొత్తపల్లి సమీపంలోని 67వ జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రొద్దుటూరు సమీపంలోని చౌడూరుకు చెందినవారిగా గుర్తించారు. పెంచలకోనకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు


