హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి'

GNTR: విద్యార్థులు సెల్‌ఫోన్ గేమ్స్‌కు దూరంగా ఉంటూ పుస్తక పఠనంపై దృష్టి సారించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. బాలల దినోత్సవం, 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శనివారం గుంటూరు అరండల్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.