హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో పాము కలకలం

ELR: ఉంగుటూరు మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం పాము రావడంతో అధికారులు భయాందోళన చెందారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాల మధ్య పాము ఉంది. పత్రాలు తీసుకోవడానికి వచ్చిన ఓ కార్యదర్శి పామును చూసి అదిరిపోయారు. సిబ్బంది కర్రలు తీసుకుని పామును తొలగించేందుకు ప్రయత్నించారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రంలోనూ పాము రావడంతో చిన్నారులు భయపడ్డారు.