అన్నమయ్య: మదనపల్లె దేవతానగర్లో చైతన్య సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్ శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల సంక్షేమం, విద్యాభివృద్ధికి సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సొసైటీ సేవలు అభినందనీయం: చిన్నబాబు


