హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంచర్ల వారి పల్లెలో ఘనంగా బాలల దినోత్సవం

ప్రకాశం: కనిగిరి మండలం కంచర్లవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం జాతీయ బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పార్వతి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్నారులు నెహ్రూ వేషధారణలో పాటలు పాడి అలరించారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ, చదువుపై శ్రద్ధ చూపాలని, బడి మానేయకూడదని పార్వతి సూచించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచారు.