రామ్లీలా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలు, నిరసనల విషయంలో ఢిల్లీ పోలీసులు నూతన మార్గదర్శకాలను సిద్ధం చేశారు. వీటి ప్రకారం ఇకపై 50 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 వేలు దాటితే పర్మిషన్ ఉండదని తేల్చి చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సా. 5 గంటల వరకు మాత్రమే సభలు, ప్రదర్శనలకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. అలాగే 10 రోజుల ముందే దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు.
వార్తలు
రామ్ లీలా.. 50 వేలకు మించితే నో పర్మిషన్!


