హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కలకలం

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భద్రతా లోపం వెలుగుచూసింది. పుణెకు చెందిన అంకేష్ అగర్వాల్ స్పై కెమెరా అమర్చిన కళ్లజోడుతో ఆలయంలోకి ప్రవేశించాడు. భ్రమరాంబిక అమ్మవారి ఆలయ పూజారి కళ్లజోడులో కెమెరాను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది సదరు భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు.