హైదరాబాద్: 28°C
వార్తలు

మహాదేవ్ యాప్ నెట్‌వర్క్‌పై సీబీఐ పంజా

ఆన్ లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ మహాదేవ్ యాప్ కేసులో దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్యానెల్ ఆపరేటర్ల స్థావరాలు ఉన్న 33 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెట్టింగ్, జూదం ప్యానెన్స్‌ను నాశనం చేసింది. అలాగే డిజిటల్ పరికరాలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.