హైదరాబాద్: 28°C
వార్తలు

మరోసారి 400 దాటిన AQI

ఢిల్లీలో వరుసగా నాలుగు రోజు కూడా వాయు నాణ్యత సూచీ(AQI) 400 పాయింట్లు దాటింది. నరేలా ప్రాంతంలో అత్యధికంగా AQI 429గా నమోదైంది. అలాగే మొత్తం 48 పర్యవేక్షణ కేంద్రాల్లో 300 దాటింది. దీంతో అప్రమత్తమై అధికారులు.. గ్రాప్-3 నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితోనే విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. అలాగే నిర్మాణాలపై ఆంక్షలు విధించారు.