హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత బ్యాటర్లను వణికించిన హెన్రీకి రెస్ట్

నాలుగో వన్డేలో భారత్ ఓటమికి ప్రధాన కారణమైన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీకి విశ్రాంతి ఇచ్చారు. తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టిన హెన్రీ.. మొత్తంగా 6 వికెట్లు తీశాడు. ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్ బంతులతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఐదో వన్డేకు అతడిని ఎంపిక చేయలేదు. ఈనెల 19నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.