హైదరాబాద్: 28°C
వార్తలు

కంగనాపై కేసు నమోదు

హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో బీజేపీ ఎంపీ, నటి కంగనాపై కేసు నమోదైంది. సోనియా గాంధీని ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలు విద్వేషాలను ప్రోత్సహించేలా, రాజ్యాంగంపై విధేయతను ప్రశ్నించేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్నాయని అతుల్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కంగనాపై BNS సెక్షన్ 353, 356, 196 కింద FIR నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.