ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది. రోజంతా నీరసం, అలసట, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు రావచ్చు. అధికంగా ఆకలి వేయడంతో ఇతర సమయాల్లో ఎక్కువ ఆహారం తీసుకునే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో బరువు పెరగడం, టైప్-2 మధుమేహం ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యం
మార్నింగ్ టిఫిన్ మానేస్తున్నారా?


