హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నాభి దర్శనాసనం వల్ల కలిగే లాభాలు

నాభి దర్శనాసనం వల్ల పొట్ట కండరాలపై ఒత్తిడి పడి దృఢంగా మారుతాయి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. నాభి ప్రాంతంలోని మణిపుర చక్రం ఉత్తేజితం కావడం వల్ల జఠరాగ్ని పెరుగుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీర బరువును చేతులు, మడమలపై మోపడం వల్ల చేతులు, భుజాలు, మణికట్లు బలోపేతమవుతాయి. వెన్నెముకకు మంచి సాగుదల లభించి నడుము నొప్పి తగ్గుతుంది.