హైదరాబాద్: 28°C
క్రీడలు

బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయొద్దు: రబాడా

బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని స్టార్ పేసర్ కగిసో రబాడా హెచ్చరించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ సిరీస్‌నూ తేలిగ్గా తీసుకోకూడదని సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ గెలిచిన ఉత్సాహాన్ని కొనసాగించాలని జట్టుకు పిలుపునిచ్చారు. ఈనెల 15 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.