మైక్రోవేవ్ పాప్‌కార్న్ బ్యాగులు వాడటం మంచిది కాదు. వీటిలో నూనె లీక్ కాకుండా 'PFAS' అనే హానికర రసాయనాలు వాడుతారు. వేడి చేసినప్పుడు ఇవి ఆహారంలో కలిసి క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఆరోగ్యం కోసం ప్యాకెట్ పాప్‌కార్న్‌కు బదులుగా ఇంట్లోనే సహజ పద్ధతిలో మొక్కజొన్న గింజలతో పాప్‌కార్న్ తయారు చేసుకోవడం ఉత్తమం.
ఆరోగ్యం
పాప్‌కార్న్ బ్యాగులు వాడుతున్నారా?


