హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఫోన్ చూస్తూ భోజనం చేస్తున్నారా..?

ఫోన్ చూస్తూ భోజనం చేయడం నేడు చాలా మందిలో ఒక సాధారణ అలవాటుగా మారింది. దీనివల్ల మన మెదడు ఆహారంపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఎంత తింటున్నామో తెలియక అతిగా తింటాము. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం భోజనం చేసే సమయంలో ఫోన్‌కు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం.