హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆర్మీ వాహనం బోల్తా.. 8 మందికి సీరియస్!

TG: రంగారెడ్డి జిల్లాలో ఆర్మీ వాహనం బోల్తా పడింది. చేవెళ్ల మండలంలోని అల్లావాడ గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది ఉండగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 8 మందికి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.