AP: విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. రిటైర్డ్ హెడ్మాస్టర్ను పోలీసులమంటూ ఫోన్ చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లు రూ.32 లక్షలు కాజేశారు. అంతర్జాతీయ నేరస్థుడితో సంబంధాలున్నాయని, సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని భయపెట్టారు. దీంతో బాధితుడి నుంచి బళ్లారిలోని బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రైమ్
డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం


