హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చద్దన్నం తినడం మంచిదేనా..?

చద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి మిగిలిన అన్నంలో నీరు పోసి ఉంచితే విటమిన్ బి6, బి12 పెరుగుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీర వేడిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కడుపులో అల్సర్, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఉదయాన్నే దీన్ని తినడం శక్తినిచ్చి, శరీరాన్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది.