TG: HYDలో నిషేధిత ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు అయింది. రాయదుర్గంలోని స్మోకిన్ స్పాట్ అవుట్‌లెట్‌పై ఈగల్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. స్మోకిన్ స్పాట్ అవుట్‌లెట్ మేనేజర్ అబూబకర్ సిద్ధిఖీని అరెస్ట్ చేశారు. 46 నిషేధిత ఈ-సిగరెట్లు, 49 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ర్యాపిడో ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
క్రైమ్
నిషేధిత ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు


