హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా పూజలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించి, గ్రామస్తులతో ముచ్చటించారు. అనంతరం కల్వకుర్తిలో రావణ దహనాన్ని తిలకించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి పాల్గొన్నారు. అహంకారం, అసూయ వీడి మానవీయ సమాజాన్ని నిర్మించాలని సీఎం పిలుపునిచ్చారు.