హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం

విశాఖ ఉత్తర నియోజకవర్గం 61వ వార్డు వైసీపీ నూతన కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు, ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజు బుధవారం ప్రారంభించారు. ఉడా కాలనీ కమ్యూనిటీ హాల్ ఎదురుగా జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి మెట్ట దమయంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.