హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల రక్షణే పోలీసుల లక్ష్యం: ఇన్‌స్పెక్టర్

MDCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ తెలిపారు.