HYD: కట్టేదాన్ సమీప ప్రేమావతిపేటలో సాహిల్ ఫుడ్స్‌కు చెందిన ఐదు తయారీ యూనిట్లపై TG SAFE అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, ఆహార నాణ్యతలో లోపాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో రూ.33.94 లక్షల విలువైన 55 టన్నుల ఆహార ఉత్పత్తులను సీజ్ చేశారు. నాలుగు యూనిట్ల లైసెన్సులను సస్పెండ్ చేసి, అనుమానిత కల్తీపై పరీక్షల కోసం 11 నమూనాలను సేకరించారు.
తెలంగాణ
కట్టేదాన్‌లో కల్తీ ఆహారం కలకలం


