PPM: బలిజిపేట మండలం 17 ఎంపీటీసీ స్థానాలకు తొలిరోజు ముగ్గురు నామినేషన్లు వేశారు. అజ్జాడ స్థానానికి టీడీపీ తరపున అక్కేన గణేశ్ రిటర్నింగ్ అధికారి వెంకటరమణకు పత్రాలు అందజేశారు. ఈయనకు మద్దతుగా టీడీపీ శ్రేణులు బస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించాయి. పెదపెంకి-2 స్థానానికి వైసీపీ తరపున గుడివాడ కల్యాణి, బలిజిపేట స్థానానికి వెలిది తాయారమ్మ నామినేషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు 3 నామినేషన్లు


