NLG: కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంలో గ్రామానికి చెందిన పులకరం కొండల్-సుజాత దంపతులు రూ.23,116కు లడ్డును దక్కించుకున్నారు. అమ్మవారి కృపతోనే లడ్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
పొనుగోడులో దుర్గామాత లడ్డూ వేలం


