హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీకి మద్దతు ప్రకటించిన ముస్లింలు

AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు నక్కపల్లి మండలానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు ప్రకటించారు. ఈ మేరకు నక్కపల్లి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం పార్టీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్‌తో బుధవారం సమావేశం అయ్యారు. కూటమితో కలిసి నడుస్తామని వారు స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థులను అందరూ ఆశీర్వదించాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.