హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీ

HNK: అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో హనుమకొండ అశోక జంక్షన్ నుంచి పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, డీసీపీ అంకిత్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.