హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీ–ఫారాలను అందజేసిన రాధా

NTR: విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫున బరిలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ బుధవారం కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధికారికంగా పోటీ చేసేందుకు అవసరమైన బీ-ఫారాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.