WGL: రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ సర్పంచ్ కందికట్ల స్వప్న రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి బుధవారం ఎంపికయ్యారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అక్టోబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించే శిక్షణలో ఆమె పాల్గొంటారు. మహిళా సాధికారత, గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సమాచార హక్కు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి శిక్షణకు కొత్తూరు సర్పంచ్


