హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్లాపూర్ నిండకముందే పంపులు బంద్

NGKL: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మొదటి లిఫ్ట్ మోటార్లను నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండకముందే నిలిపివేశారు. రెండు మోటార్ల ద్వారా సుమారు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ వినియోగించడం లేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. మోటార్లను తిరిగి ప్రారంభించి ఏదులకు కృష్ణా జలాలను తరలించాలని డిమాండ్ చేశాయి.