హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల రక్షణలో ప్రాణాలర్పించిన వీరులకు సెల్యూట్!

MDCL: దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్, నేరేడ్‌మెట్ పోలీసులు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులను సత్కరించి, దేశ రక్షణలో వారి సేవలను ప్రశంసించారు.