హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో బలంగా వైసీపీ

ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల బరిలో బీజేపీ కూటమి తరపున జాడి వీరనారాయణ, వైసీపీ తరపున భూమా నరసింహారెడ్డి నిలిచారు. మొత్తం 28 వార్డుల్లో వైసీపీకి బలమైన నాయకత్వం ఉండగా, బీజేపీ మాత్రం పూర్తిగా టీడీపీ కేడర్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో, తుది విజయం ఎవరిని వరిస్తుందో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.