ASF: సిర్పూర్-యు మండలం కోహినూర్ (బి) గ్రామంలో సోయా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రజా మిత్ర ఆధ్వర్యంలో సీసీడీ నగేష్, అశోక్ రైతుల నుంచి సోయాను కొనుగోలు చేశారు. ప్రభుత్వ మద్దతు ధరకు పంటను విక్రయించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సోయాలో తేమ శాతాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
మద్దతు ధరకు సోయా కొనుగోళ్లు


