హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి మజ్జిపేట వైసీపీ నేతలు

VSP: భీమిలి మండలం మజ్జిపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మజ్జి వెంకటరావు సహా 100 మంది వైసీపీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. విశాఖ ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో వారికి గంటా పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలన చూసే చేరికలు జరుగుతున్నాయని, స్థానిక ఎన్నికల్లో గెలుపు ఖాయమని అన్నారు.