హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌కు 140 ప్రత్యేక బస్సులు

HNK: దసరా సెలవులు ముగియడంతో సొంత ఊర్లకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో హన్మకొండ బస్టాండ్‌లో బుధవారం ప్రయాణికుల రద్దీ కనిపించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు 140 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTC ఆర్ఎం సోమరాజు భవానీ ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందన్నారు.