హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీపీ, షుగర్ ఉన్నవాళ్లను కాపాడుకోండి: జగ్గారెడ్డి

SRD: బీపీ, షుగర్‌తో బాధపడేవారు ప్రతిరోజూ వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. ఇంట్లో తల్లిదండ్రులు ఈ సమస్యలతో బాధపడుతుంటే, వారు సమయానికి మందులు తీసుకునేలా కుటుంబ సభ్యులు శ్రద్ధ చూపాలని కోరారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పిల్లల బాధ్యత అని పేర్కొన్నారు.