హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: డీసీపీ

జనగామ జిల్లా కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద బుధవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్ పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు రతీష్, నర్సయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.