హైదరాబాద్: 28°C
తెలంగాణ

అశోక్ లేలాండ్ వాహనాన్ని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

RR: వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి (38) ప్రాణాలు కోల్పోగా, ఆయన ఐదేళ్ల కుమార్తె దేవికి గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన తండ్రీకూతుళ్లను శంషాబాద్‌లోని లీమ్స్ ఆసుపత్రికి తరలించగా, రవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.