KMR: గాంధారి పట్టణంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో డీజేకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎస్సై మహేందర్ చిన్న బాక్సులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో పట్టణంలో సాయంత్రం 4 గంటల నుంచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని ఎస్సై డీఎస్పీకి వివరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
సాయంత్రం 4 గంటల నుంచి ట్రాఫిక్ జామ్


