హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్టిఫికెట్ల పరిశీలనకు రావద్దు'

SKLM: ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులు ముందుగా ప్రకటించిన తేదీన హాజరుకావద్దని జిల్లా ప్రజా రవాణా అధికారి సీ హెచ్. అప్పల నారాయణ బుధవారం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గతంలో ప్రకటించిన సర్టిఫికెట్ల పరిశీలన తేదీని రద్దు చేసినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.