హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలి'

ASR: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను బుధవారం సబ్ కలెక్టర్ సాహిత్ పరిశీలించారు. అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లను తనిఖీ చేసి, భద్రత, రిటర్నింగ్ అధికారుల విధులపై సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.