హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నార్త్ రాజుపాలెం బిట్ -1 ఎంపీటీసీ అభ్యర్థిగా మధురిమ నామినేషన్

NLR: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం గ్రామపంచాయతీ బిట్ -1 ఎంపీటీసీ అభ్యర్థిగా పోశం రెడ్డి మధురిమ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.