హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీనివాస కాలనీలో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో అమ్మవారి శోభయాత్ర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకున్న అమ్మవారికి నేడు అభిమన్యు యువజన సంఘం సభ్యులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. వేడుకల్లో చిన్నారుల నృత్యాలు, కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకను తిలకించేందుకు కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.