హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి నాణ్యతపై నిరంతర తనిఖీలు: ద.మ రైల్వే

MDCL: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో తాగునీరు సురక్షితమేనని ద.మ రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకు సేకరించిన 50 నీటి నమూనాలను పరీక్షించగా, ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించలేదని తెలిపింది. ముఖ్యంగా ఈ-కోలీ బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. ప్రయాణికులకు నాణ్యమైన తాగునీరు అందించేందుకు నిరంతరం తనిఖీలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.