హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజరాజేశ్వరి దేవిగా భద్రకాళి అమ్మవారు

కడప జిల్లా చిట్వేల్ మండలం పాత చిట్వేల్ గ్రామంలోని శ్రీ భద్రకాళి అమ్మవారు బుధవారం రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. డీజే, గాన భజనల నడుమ అమ్మవారిని పాత చిట్వేల్ నుంచి చిట్వేల్ పట్టణానికి వైభవంగా ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగింది.