హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లెక్సీ దహనం.. ఆరుగురు పై కేసు నమోదు

SDPT: కోహెడ మండలం ధర్మసాగర్‌పల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని దహనం చేసిన ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.