హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్లకు వాహనాలు ఇస్తే క్రిమినల్ కేసులు: SP

ADB: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో SP మాట్లాడారు. దసరా సెలవుల సందర్భంగా జిల్లావ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 376 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.